schedule Thursday, September 10, 2026

ఎల్లుండే.. కొలువుల జాతర..!

calendar_today May 27, 2025
person dharshininews
ఎల్లుండే.. కొలువుల జాతర..!
ఎల్లుండే.. కొలువుల జాతర..! - యువతకు 10వేల ఉద్యోగాలు - బీఎంఆర్‌ జాబ్‌ మేళాకు తరలిరండి - యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కావలి సంతోష్‌ కుమార్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కొలువుల జాతరకు భారీగా తరలిరావాలని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్, సీనీయర్ యువనాయకులు కావలి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈనెల 29న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్‌ మేళా జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) సహకారంతో దాదాపు 50 కంపెనీ నుంచి ప్రతినిధులు వారి కంపెనీలలోని ఉద్యోగాలకు ఇంటర్వూలు నిర్వహిస్తారని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివిని అభ్యర్థులు అర్హులని తెలిపారు. 10వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్వహిస్తున్న జాబ్ మేళాకు యువకులు తమ బయోడేటా, పాస్‌ ఫోటో, దృవీకరణ పత్రాలు వెంట తీసుకరావాలని సూచించారు. ఎంపిక కాలేకపోయిన వారికి 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి, భోజనం కలిపి మరింత నైపుణ్యం పెంపొందించే అవకాశాన్ని కూడా మనోహర్ రెడ్డి చొరవతో అందిస్తున్నారని తెలిపారు. కాగా గతంలో విజయవంతంగా నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు సమకూర్చారని గుర్తుచేశారు. తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మెళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35754/