schedule Monday, July 06, 2026

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి

calendar_today June 1, 2025
person dharshininews
అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి
అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి - సికింద్రాబాద్ డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ - తాండూరు రైల్వే స్టేషన్ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ భారత్ కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని దక్షణ మధ్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ అన్నారు. ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ ను ఆయన అధికారులతో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. తాండూరులో అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. స్టేషన్లో వేయిటింగ్ హాల్, ప్లాట్ ఫారం పునరుద్దీకరణ, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులను దశలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ లో రూ. 24 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు, తాండూరు రైల్వే స్టేషన్ అధికారులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35916/