schedule Monday, July 06, 2026

పరిశుభ్రత అందరి బాధ్యత

calendar_today June 3, 2025
person dharshininews
పరిశుభ్రత అందరి బాధ్యత
పరిశుభ్రత అందరి బాధ్యత - కాలనీల స్వచ్ఛతకు అందరు సహకరించాలి - వికారాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ - తాండూరులో 100 డేస్ కార్యక్రమంపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 6వ వార్డుతో పాటు పలు వార్డుల్లో 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీ, అవగాహన కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు అందరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఒక మార్పు.. అభివృద్ధికి మలువు అవుతుందన్నారు. ఇంటిలో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. కాలనీలు అన్నింటిని స్వచ్ఛతగా మార్చేందుకు భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా వార్డులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా, ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్, మెప్మా టీఎంసీ రాజేంద్ర ప్రసాద్, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35934/