schedule Monday, July 06, 2026

పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..!

calendar_today June 6, 2025
person dharshininews
పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..!
పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..! - తడి, పొడి చెత్తలను వేరుగా అందించాలి - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిశుభ్రతలో ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. 100 డేస్ స్వచ్చత కార్యక్రంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరై ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అపరిశుభ్రత వల్ల చిన్నారులతో పాటు పెద్దలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. డెంగీ, మలేరియా వంటి రోగాలు వస్తాయన్నారు. కావున ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంట్లో ఉన్న తడిచెత్తను, పొడి చెత్తను వేరు చేసి అందించాలని అన్నారు. చెత్తను రోడ్లపై పడేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, జిలాని, మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్‌, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్‌, వార్డు జవాన్ సిహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35988/