schedule Monday, July 06, 2026

హకీంపేట్ రైతులకు రూ.10.75 కోట్ల పరిహారం

calendar_today June 17, 2025
person dharshininews
హకీంపేట్ రైతులకు రూ.10.75 కోట్ల పరిహారం
హకీంపేట్ రైతులకు రూ.10.75 కోట్ల పరిహారం - సబ్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు (ఎంపీఐపీ) కోసం భూములు అందించిన హకీంపేట్ రైతులకు చెక్కులు పంపీణీ చేశారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సమక్షంలో దుద్యాల తహసీల్దార్ కిషన్ నాయక్ చేతుల మీదుగా 53ఎకరాల 30 గుంటల భూమిని అందించిన 29 మంది రైతులకు రూ. 10 కోట్ల 75లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు కోసం భూములు కోల్పోయిన హకీంపేట్ రైతులకు అందించిన పరి హారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36214/