schedule Monday, July 06, 2026

ప్రగతి పకడ్బందీగా..!

calendar_today June 18, 2025
person dharshininews
ప్రగతి పకడ్బందీగా..!
ప్రగతి పకడ్బందీగా..! - అభివృద్ధి పనులపై పర్యవేక్షణ - చిలుకవాగు, అమృత్ పనులపై ఆరా - పరిశీలించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆదేశించారు. బుధవారం ఆ శాఖ ఎస్ఈ చెన్నారావు, ఈఈ ప్రభాకర్ రెడ్డిలు తాండూరులో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ముందుగా రూ. 16 కోట్లతో చేపడుతున్న చిలుక వాగు డ్రైన్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేపడుతున్నారని స్థానిక మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల నాణ్యతను కూడా పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంటలో ఇటీవల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ.2కోట్లతో చేపడుతున్న సైడ్ డ్రైన్ పనులను పరిశీలించారు. చిలుక వాగు డ్రైన్.. ఆదర్శనగర్ డ్రైన్ అనుసంధాంపై ఆరా తీశారు. అదే సమయంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అధికారులను కలిశారు. డ్రైన్ నిర్మాణ స్వరూపంపై ఉన్న అనుమానాలపై వివరించారు. పనులు త్వరగా చేపట్టేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. మరోవైపు అధికారులు పట్టణంలో అమృత్2.0 ద్వారా రూ. 27 కోట్లతో చేపడుతున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ నగర్ లో నిర్మిస్తున్న ట్యాంకు పనులను పరిశీలించారు. అంతేకాకుండా పట్టణంలో టీఎఫ్‌ఐడీసీ కింద చేపడుతున్న వివిధ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న ప్రగతి పనులను పకడ్బందీగా చె పట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగడకుండా పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యత, వేగవంతంగా.. గడువులోగా పూర్తి చేయడంలో తాత్సారం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ శాఖ ఏఈ సాజిద్, కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు. డ్రైన్ పనులపై అభ్యంతరం పట్టణంలోని ఆదర్శ నగర్ వద్ద చేపట్టే సైడ్ డ్రైన్ పనులపై వివాదం ఏర్పడింది. అధికారులు స్థలాన్ని పరిశీలించే సమయంలో వివాదాస్పద స్థలం యజమాని రంగారావు అక్కడి వచ్చారు. తమ స్థలంలో డ్రైన్ నిర్మించకుండా చూడాలని కోరారు. ఇదే విషయంపై మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సిం హారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిల మద్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి నష్టం జరగకుండా నిబంధనల మేరకు నిర్మాణ పనులు చేపడుతామని వారు రంగారావుకు నచ్చజెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36230/