schedule Monday, July 06, 2026

అధ్యయనాలతో రైతులకు మేలు

calendar_today June 20, 2025
person dharshininews
అధ్యయనాలతో రైతులకు మేలు
అధ్యయనాలతో రైతులకు మేలు - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - పాలకవర్గంతో కలిసి కర్ణాటకకు స్టడీ టూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర రాష్ట్రాల్లో రైతుల కోసం మార్కెట్ కమిటీల ద్వారా అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి రైతులకు మేలు జరిగే విధంగా దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటి పాలకవర్గంతో పాటు అధికారులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలో వివిధ మార్కెట్ కమిటీల అధ్యయనానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని మార్కెట్ కమిటిలలో అక్కడ వ్యవసాయ ఉత్పత్తులకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతుల కోసం కల్పించే సదుపాయాలను కల్పించే విధానాలను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు. అక్కడి విధానాలకు మనకు ఏవిధంగా ఉపయోగపడాతాయో అని పరిశీలించి ఇక్కడ అమలుపై దృష్టిసారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్ రెడ్డి, తులసీరాం రాథోడ్, జర్నప్ప. అంజద్ అలీ, దినేష్ సింగ్, మాజీ డైరెక్టర్ రాజు, వ్యాపారులు కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, మార్కెట్ కమిటి కార్యదర్శి, సూపర్ వైజర్, తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36281/