schedule Monday, July 06, 2026

రాస్నం సంతోష్ యాదిలో..!

calendar_today June 23, 2025
person dharshininews
రాస్నం సంతోష్ యాదిలో..!
రాస్నం సంతోష్ యాదిలో..! - భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ యువదళ్ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ రాస్నం సంతోష్ కుమార్ కు వీరశైవ సమాజం సభ్యులు, యువదళ్ సభ్యులు నీరాజనాలు తెలిపారు. సోమవారం సంతోష్ కుమార్ తృతీయ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన తండ్రి వీరశైవ సమాజం అధ్యక్షులు రాస్నం బస్వరాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర దేవాయలంలో పూజలు నిర్వహించారు. అనంతరం దాసోహ మందిరంలో రాస్నం వర్ధంతి సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజం కార్యదర్శి లింగదలి రవికుమార్, కార్యవర్గ సభ్యులు గాజుల శాంత్ కుమార్, వాలి శ్రావణ్, వాలి శాంత్ కుమార్, శెట్టి భాస్కర్, గంగా శ్రావణ్, యువదళ్ అధ్యక్షులు అడికి శశాంక్, సభ్యులు సందీప్, గడిగి కిరణ్, గంగిమళ్ల మహేష్, ప్రకాష్, మడపతి శాంత్ కుమార్, దేవాలయ కమిటి సభ్యులు జొన్నల బస్వరాజ్, అశోక్, అనాల నాగార్జున రావు. రైల్వే స్టేషన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36374/