schedule Monday, July 06, 2026

గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ

calendar_today June 23, 2025
person dharshininews
గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ
గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ - ఆయన ఆశయ సాధనకు కృషి - వర్ధంతిలో బీజేపీ నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా నినాదంతో పోరాడిన డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది అని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలో జన్ సంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని జరుపుకున్నార. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, నాయకులు బాలి శివకుమార్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, పటేల్ విజయ్ కుమార్, బంటారం భద్రేశ్వర్, సుదర్శన్ గౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు మరువలేని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని గుర్తుచేశారు. కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా దేశంలో బీజేపీ పాలన చేస్తుందని అన్నారు. ఆయన మార్గంలో దేశం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, నాయకులు దోమ కృష్ణ, మోత్కుపల్లి చంద్రశేఖర్, జగదీష్ యాదవ్, మంతటి రాజు, చిదిరి ప్రకా ష్, మిట్టి శ్రీనివాస్, తాండ్ర చంద్రశేఖర్, నరేందర్ రెడ్డి, కావలి కృష్ణ, బిచ్చప్ప, వడ్డె సాయిలు, సతీష్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36382/