schedule Monday, July 06, 2026

ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు

calendar_today June 23, 2025
person dharshininews
ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు
ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు - మురుగు కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు - వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి - గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని గాంధీనగర్ వార్డు సమస్యలు గాలికి వదిలేశారని 20వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారిన కంపచెట్ల తొలగింపు, మురుగు కాలువల పరిశుభ్రం చేయించారు. వార్డులో పెద్ద మురుగు కాలువ నుంచి వస్తున్న మురుగు చిన్న కాలువల్లోకి చేరడంతో రోడ్లపైకి వస్తుందని అన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వార్డులో మురుగు కాలువలను నిర్మించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి, మున్సిపల్ కమీషనర్లకు వినతిపత్రాలు అందించడం జరిగిందన్నారు. అయినా నేటికి సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. వార్డులోని సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. అవసరం ఉన్న చోట కాకుండా అనవసరమైన ప్రాంతాల్లో మురుగు కాలువలు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వార్డులోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36387/