schedule Monday, July 06, 2026

ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి

calendar_today June 24, 2025
person dharshininews
ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి
ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి - అభివృద్ధి, సంక్షేమాన్ని అందిపుచ్చుకోవాలి - మల్ రెడ్డిపల్లిలో బీజేపీ వికసిత్ భారత్ పై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. బీజేపీ 11 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంపై మంగళవారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లిలో అవగాహన కల్పించారు. బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మాజీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మాజీ కౌన్సిలర్ బంటారం లావణ్య, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కరోనా నుంచి ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుందని తెలిపారు. రైతులకు ఎరువులు అందిస్తుందని అన్నారు. అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమానలు చేపడుతుందని వివరించారు. బీజేపీతోనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, ప్రజల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, వడ్డె సాయిలు, బస్వరాజ్, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36416/