schedule Monday, July 06, 2026

హస్తంలో సంస్థాగత సందడి..!

calendar_today June 29, 2025
person dharshininews
హస్తంలో సంస్థాగత సందడి..!
హస్తంలో సంస్థాగత సందడి..! - రేపు కార్యకర్తలతో సమావేశాలకు ఏర్పాట్లు - నామినేటేడ్, అధ్యక్షల పదవులకు దరఖాస్తుల స్వీకరణ - హాజరు కానున్న జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేపు సోమవారం కార్యకర్తలను చైతన్య పరిచేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పార్టీ నుంచి ఆశావాహుల ద్వారా నామినేటేడ్, పార్టీ అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో పాటు పార్టీ పరిశీల కులు వినోద్ కుమార్ రెడ్డి, రాంశెట్టి నరేందర్ లు హాజరవుతున్నారు. ఉదయం 11గంటలకు బషీరాబాద్ మండలంలో, మధ్యాహ్నం 12 గంటలకు యాలాల మండలంలో, 1గంటలకు తాండూరు మండలంలో, 2-30గంటలకు పెద్దేముల్ మండలంలో, 3-30గంటలకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశాలల్లో పార్టీ నామినేటేడ్ పదవులు, మండల, పట్టణ అధ్యక్షుల పదవుల కోసం దరాఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు. కావున పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36499/