schedule Monday, July 06, 2026

ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..!

calendar_today July 3, 2025
person dharshininews
ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..!
ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..! - ఎల్సీ తీసుకోకుండా తోటలో విద్యుత్ పనులు - పనులు చేస్తున్న వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి - తాండూరు మండలం ఎల్మకన్నెలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓ ఫౌంహౌస్ యజమాని చేసిన నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైపోయినట్లు తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామస్తులు ఆరోపించారు. ఫాంహౌస్ లోని తోటలో విద్యుత్ పనులు చేస్తుండగా షాక్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గండీడ్ మండలంకు చెందిన గోపాల్ రాథోడ్ అనే వ్యక్తి తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఫాం హైస్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో మామిడితో పనులు చేయిస్తున్నారు. అయితే ఫాం హౌస్ లో విద్యుత్ పనులు చేపట్టేందుకు లైన్ మెన్ యాదయ్యకు ఫోన్ చేసి ఎల్ సీ ఇవ్వాలని కోరారు. ఇందుకు లైన్ మెన్ అరగంట పడుతుందని చెప్పారు. అంతలోనే అప్పుడప్పుడు విద్యుత్ పనులు చేసే గ్రామానికి చెందిన ముజాయిద్(40) అక్కడ కనిపించాడు. దీంతో యజమాని గొ పాల్ ముజాయిద్ ను ఫాంహౌస్ వద్దకు తీసుకెళ్లాడు. ఎలాంటి ఎల్ సీ తీసుకోకుండా పనులు చె యించాడు. ఈ క్రమంలో ముజాయిద్ కు విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. గమనించిన యజమాని గోపాల్ ముజాయిద్ ను ఆసుపత్రికి తరలించేందుకు ఆలస్యం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంభీకులు వెంటనే తాండూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ముజాయిద్ ప్రాణాలను విడిచాడు. ముజాయిద్ మృతిపై కుటుంభీకులు ఆందోళనకు దిగారు. విషయం పెద్దగా మారడంతో యజమానికి పరారైనట్లు తెలుస్తోంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘన స్థానికంగా కలకలం రేపింది. మృతునికి భార్య పర్వీనా భేగం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36558/