schedule Thursday, September 10, 2026

జాతీయ రక్షణ నిధికి చేయూత..!

calendar_today July 4, 2025
person dharshininews
జాతీయ రక్షణ నిధికి చేయూత..!
జాతీయ రక్షణ నిధికి చేయూత..! - ఆర్బీఓఎల్ నుంచి రూ. 3లక్షల విరాళం - ప్రకటించిన సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జక్కెపల్లి పరిధిలోని రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఆర్బీఓల్) జాతీయ రక్షణ నిధి(నేషనల్ డిఫెన్స్) కి తమ వంతు చేయూతను అందించింది. పెహెల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆర్బీఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి విరాళం అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత మే నెలలో రూ.2లక్షల విరాళం అందజేశారు. తాజాగా ఆర్బీఓఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి రూ. 3లక్షల విరాళం ప్రకటించి భారత సైనిక సంక్షేమానికి చేయూతను అందించారు. ఆర్బీఓఎల్ కర్మాగారం ఆధాయంలో ప్రతి నెల రూ.2లక్షలు అందిస్తామని సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36590/