schedule Wednesday, September 09, 2026

బీఎస్ఆర్ మానవత్వం..!

calendar_today July 5, 2025
person dharshininews
బీఎస్ఆర్ మానవత్వం..!
బీఎస్ఆర్ మానవత్వం..! - అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు భరోసా - అనుచరుల ద్వారా ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తకు భరోసా అందించారు. చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం కొర్విచేడు గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తన అనుచరులు యువ నాయకులు వికాస్ జోషి ద్వారా శ్రీనివాస్ చికిత్స కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని తెలిపారు. అదేవిధంగా ఆర్థిక సాయం పొందిన శ్రీనివాస్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందజేసిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది కూడా చదవండి...     https://www.dharshininews.com/36625/