schedule Saturday, July 04, 2026

ఓపెన్ చాన్స్..!

calendar_today July 6, 2025
person dharshininews
ఓపెన్ చాన్స్..!
ఓపెన్ చాన్స్..! - టెన్త్, ఇంటర్‌లో చేరేందుకు అవకాశం - అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా - రాజకీయ నాయకులకు ఉపయోగం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ మళ్లీ చదువుకునేందుకు చాన్స్ ఇస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంపోందించేందుకు సార్వత్రిక విధానం(దూరవిద్య) ద్వారా మార్గం చూపిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ స్కూల్‌లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో చేరేందుకు 14 నుంచి 50 ఏండ్లు ఉన్న వారు, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులు అయిన 15 ఏండ్ల నుంచి మిగతా వయస్సు వారు అర్హులు. ఈనెల 11వ తేది వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు రెగ్యులర్ అకాడమిక్ క్రెడిట్ అవకాశాలను అందించడానికి గతంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, సబ్జెక్టులలో ఫెయిల్ అయిన అభ్యర్థులు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్నటువంటి SSC & Intermediate కోర్సుల్లో ప్రవేశం పొంది. మిగిలిన సబ్జెక్టులను ఇక్కడ వారికి అనుగుణంగా ఫీజు కట్టుకొని పాస్ కావడానికి అవకాశాలు కల్పిస్తుంది. అదే విధంగా ఇక్కడ పాసైన అభ్యర్థులకు రెగ్యులర్ అకాడమిక్ క్రెడిట్ అందుతుంది. ఈ ఓపెన్ స్కూల్ విధానం అందరికి ఉపయోగపడుతోంది. రాజకీయ నాయకులకు సువర్ణ అవకాశం ఓపెన్ స్కూల్ విద్యా వ్యవస్థ రాజకీయ నాయకులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా రాణించాలంటే పదో తరగతి ప్రామాణికం కాబోతోంది. ఇక్కడ చదివి సర్టిఫికెట్లను పొందవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యావేత్తలు చెబుతున్నారు. దరఖాస్తు కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.telanganaopenschool.org/ ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36622/