schedule Monday, July 06, 2026

కక్ష్య పెంచుకుని కొడవలితో దాడి..!

calendar_today July 6, 2025
person dharshininews
కక్ష్య పెంచుకుని కొడవలితో దాడి..!
కక్ష్య పెంచుకుని కొడవలితో దాడి..! - వ్యక్తిపై మైనర్ బాలుడి ఘాతుకం - గాయాలతో ఆసుపత్రి పాలైన వ్యక్తి - బషీరాబాద్ ఎక్మాయిలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విషయంలో నీతులు చెబుతున్నాడని కక్ష్య పెంచకుని ఓ మైనర్ బాలుడు వ్యక్తిపై కొడవలితో దాడి చేశాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వ్యక్తి గాయాలతో ఆసుపత్రి పాలయయ్యాడు. ఈ సంఘటన బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామంంలో కలకలం రేపింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మారేప్ప వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి సమీపంలో ఉండే బాలుడు, అయితే మహేష్‌ గత కొంత కాలంగా మద్యం, మత్తు పదర్ధాలకు బానిసగా మారినట్లు పుకార్లు ఉన్నాయి. మహేష్‌ చేస్తున్న చేష్టలపై కొన్నిసార్లు మందలించినట్లు బాధితుడు మారేప్ప తెలిపాడు. శనివారం గ్రామంలో జరిగే పీర్లపండగ వద్ద కూడా మారెప్ప, మైనర్ బాలుడి మద్య వివాదం జరిగింది. ఇదే విషయంమై ఆదివారం మధ్యాహ్నం సమయంలో మరోసారి వాగ్వివాదం జరగడంతో మనసులో కక్ష్య పెంచుకున్న మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న కొడవలి తీసుకవచ్చి మారెప్ప మెడ భాగంలో దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో తలపై కూడా గాయాలయ్యాయి. వెంటనే మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయాలపాలైన మారెప్పను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి మైనర్ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాండూరు డీఎస్పీ కార్యాలయానికి తీసుకవచ్చి కోర్టులో రిమాండు చేయనున్నట్లు తెలిసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36659/