schedule Wednesday, September 09, 2026

మార్మోగిన సాయి నామస్మరణ..!

calendar_today July 9, 2025
person dharshininews
మార్మోగిన సాయి నామస్మరణ..!
మార్మోగిన సాయి నామస్మరణ..! - తాండూరులో శోభాయమానంగా శోభాయాత్ర - సాయినాథునికి పూజలు, దర్శించుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిబాబా నామస్మరణతో పరవశించింది. గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు - కోకట్ రోడ్డు మార్గంలో వెలసిస షిర్డిసాయిబాబా దేవాలయ భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన సాయిబాబా ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. ప్రతి యేడాది గురు పౌర్ణమి సందర్భంగా పట్టణ పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని కోడంగల్డ్, అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న భవాని మాత దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ముందుకు కదిలింది. పట్టణంలోని పుర వీదులగుండా ఈ ఊరేగింపు కొనసాగింది. భవానిమాత దేవాలయం నుంచి శివాజీ చౌక్, మర్రి చెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వర్చౌక్, మార్వాడి బజార్, డీఎస్పీ కార్యాలయం మీదుగా కదిలింది. ఊరేగింపు ముందు భక్తులు సాయిబాబా మహిమలను చాటుతూ భజన కీర్తనలు ఆలాపించారు. భక్తుల చెక్క, అడుగుల భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఊరేగింపుకు ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మరోవైపు దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి, భజనమండలి సభ్యులు పేర్కొన్నారు. ఉదయం మేలుకోలుపు, సామూహిక పుష్పాభిషేకం, మధ్యాహ్న హారతి, అన్నదానం, సాయంత్రం హారతి, రాత్రి పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. గురుపౌర్ణమి మహోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సాయికృపకు పాత్రులు కాగలరని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36730/