schedule Monday, July 06, 2026

పక్కా కమర్షియల్ ఆర్ఐ..!

calendar_today July 12, 2025
person dharshininews
పక్కా కమర్షియల్ ఆర్ఐ..!
పక్కా కమర్షియల్ ఆర్ఐ..! - బడా వ్యాపారి బిల్డింగ్‌కు ట్యాక్స్ మైనస్‌ - తాండూరు మున్సిపల్ లక్షల ఆధాయానికి గండి - ఎలా చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు బాధ్యతను పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ప్రభుత్వ నుంచి జీతం తీసుకుని చేస్తున్న పనిలో అవినీతికి పాల్పడుతూ కమర్షియల్‌గా మారుతుంటారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఐ పక్కా కమర్షియల్ అవతారం ఎత్తారు. పట్టణంలో ఓ కమర్షియల్ భవనానికి డోమాస్టిక్ భవనంగా మార్పు చేసి మున్సిపల్ విధిస్తున్న ట్యాక్స్‌ను మైనస్‌గా మార్చేందుకు మేనేజ్ చేశాడు. భవన యజమానితో బేరం కుదురుర్చుకుని లక్షల ఆధాయానికి గండి కొట్టారు. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ శాఖలో కలకలం రేపింది. అసలు ఎలా చేశారో తెలిసి షాక్‌కు గురవుతున్నారు. ఆర్జేడీ విచారణకు ఆదేశించడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలో బడా వ్యాపారికి చెందిన వాణిజ్య దుకాణాల భవనం ఉంది. 11గజాలు ఉన్న ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్, షెటర్లు, సెల్లార్, ఫస్ట్ ఫోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొనసాగుతోంది. అయితే సుమారు 2017 నుంచి మున్సిపల్‌కు ఆస్తిపన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పన్నులు చెల్లించడం లేదు. దీంతో ఈ భవనంపై ఉన్న ఆస్తి పన్ను సుమారు రూ. 11లక్షల వరకు పెరిగింది. ఈ భవనం పన్నుల తగ్గింపులో మున్సిపల్ ఆర్ఐ అవినీతికి పాల్పడ్డారు. లక్షల ట్యాక్స్‌.. వేలుగా మార్పు 2017 తరువాత భువన్ యాప్‌లో అధికారులు పట్టణంలోని నివాసాలు, కమర్షియిల్ భవనాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వాటిని సర్వే చేసి వాటిపై ఆస్తిపన్నులు నిర్దారించారు. ఈ క్రమంలో వ్యాపారి భవనానికి సంవత్సరానికి రూ. 1లక్ష 50 వేల నుంచి సుమారు రూ. 2లక్షల వరకు పన్నుల విధించాల్సి ఉంది. భువన్ సర్వే సమయంలో యజమాని భవనాన్ని కొలిచేందుకు సహకరించలేదని, గజాలను తక్కువగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మున్సిపల్‌కు చెందిన ఆర్ఐ వ్యాపారికి సహకరించేందుకు బేరం చేసుకున్నట్లు తెలిసింది. మున్సిపల్‌లో వినియోగిస్తున్న టెక్నికల్‌ సిస్టమ్‌ను అడ్డుకుని 1100 గజాలు ఉన్న బిల్డింగ్‌ను అదే బిల్డింగ్‌లోని ఓ షెటర్‌ విస్తీర్ణానికి మార్చినట్లు సమాచారం. దీంతో సుమారు 11లక్షలు ఉన్న ఆస్తి పన్నులను బకాయిలతో కలపి దాదాపు రూ. 46వేలు మార్చి మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో వ్యాపారికి సహకరించిన ఆర్ఐ భారీ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాండూరులో జరుగుతన్న కుంబకోణంపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36825/