schedule Thursday, September 03, 2026

కూరగాయాల్లో కింగ్..!

calendar_today July 16, 2025
person dharshininews
కూరగాయాల్లో కింగ్..!
కూరగాయాల్లో కింగ్..! - బోడకాకరతో బోలెడు లాభాలు - బీపీ, హాట్ ప్రాబ్లమ్స్ తగ్గించే శక్తి - విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలం దర్శిని డెస్క్ : కూరగాయాల్లో వంకాయను రాజుగా అభివర్ణిస్తుంటారు. వంకాయేకాదు.. బోడ కాకరకాయను కూడా కింగ్‌ అనే పిలుస్తారు. ఎందుకంటే ఇందులోని విటమిన్స్‌.. మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో బోడకాకర కాయ తినడం వలన అనేక లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్స్‌, మినరల్స్‌ చాలా మందిని వేధిస్తున్న బీపీ, హాట్ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. బోడ కాకరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువలన దీనిని ప్రతి తీరోజూ తీసుకుంటే, ఇది కడుపు నిండిన భావన కలిగి అధిక ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బోడ కాకరలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. మటన్, చికెన్‌లలో లభించనన్ని పోషకాలు ఇందులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్,అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్, ఇవన్నీ ఉంటాయి. అందుకే వర్షకాలంలో తప్పకుండా వీటిని తినాలంటారు. అదే విధంగా డయాబెటీస్ ఉన్న వారు వర్షాకాలంలో బోడ కాకర కాయను తినడం వల ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుందంట. ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉండటం వలన ఇది డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుందంట. అదేవిధంగా బోడకాకరలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందు వలన బోడ కాకరను తినడం వలన క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరవంట. kvcs అంతే కాకుండా ఇది రక్త పోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె సమస్యలు రాకుండా చేస్తుందంట. అంతే కాకుండా బోడ కాకరలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉండటం వలన ఇది రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బోడ కాకర చాలా మంచిదంట. అలాగే బోడ కాకరలో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకల బలానికి చాలా మంచిది. అలాగే దీనిని వర్షాకాలంలో తినడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు , వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కలిపిస్తుందంట. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36870/