schedule Wednesday, September 09, 2026

సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..!

calendar_today July 16, 2025
person dharshininews
సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..!
సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..! - విచారణకు హాజరైన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేపడుతున్న సిట్ అధికారుల ఎంక్వయిరీకి తాండూరుకు చెందిన రాజకీయ నేతలు వరుసగా హాజరవుతున్నారు. మంగళవారం తాండూరుకు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ విచారణకు హాజరు కాగా బుధవారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల సెల్ ఫోన్లు టాపింగ్ కు గురయ్యాయన నేపథ్యంలో సిట్ ప్రత్యేక విచారణ జలుపుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాండూరుకు చెందిన పలువురు నేతలకు సెట్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే తాండూరుకు చెందిన పలువురు నాయకులు వరుసగా సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. అధికారులు అడిగిన పలు విషయాలను వెల్లడించినట్లు చైర్మన్ బాల్ రెడ్డి తెలిపారు. సిట్ అధికారులు బాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నట్లు తెలిపారు. మరోసారి విచారణకు పిలిచిన సహకరిస్తానని తెలిపారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/36897/