schedule Sunday, July 05, 2026

శాకాంబరీ నమోస్తుతే..!

calendar_today July 18, 2025
person dharshininews
శాకాంబరీ నమోస్తుతే..!
శాకాంబరీ నమోస్తుతే..! - అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ - పలు దేవాయాల్లో ఆషాడ శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాడమాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవయాలాల్లో శాకాంబరీ మహోత్సవాలను నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకానాగ ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలి వద్ద వెలసిన రక్తమైసమ్మ దేవాలయం, వాల్మీకీ నగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయాలలోని అమ్మవార్లను శాకాంబరీ మాతలుగా అలంకరించారు ఆయా దేవాలయాలలో అమ్మవార్లను కూరగాయలు, ఆకు కూరలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెహ్రుగంజ్లోని రేణుకానాగ ఎల్లమ్మను ఆలయ మహిళ మండలి ఆధ్వర్యంలో అమ్మవారి రకాల కూరగాలతో పాటు ఐదు రకాల పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఉదయం నుంచి లలిత సహస్రనామ పారా కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు భక్తులు కూడ ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. మిగతా దేవాలయాలలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లలిత సహస్ర నామా పారాయణలతో అమ్మవారిని వేడుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36948/