schedule Wednesday, September 09, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

calendar_today July 19, 2025
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
kvcs ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు - బషీరాబాద్‌ నూతన ఎంపీడీఓ తిరుమల - కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పథకాల అముల, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బషీరాబాద్ మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) తిరుమల అన్నారు. శనివారం బషీరాబాద్ మండల ఎంపీడీఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బషీరాబాద్ మండలంలో ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో నల్గొండ జిల్లా నుంచి ఆయనను బషీరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఇంచార్జ్ ఎంపీడీఓగా పనిచేస్తున్న విజయ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందేంచే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా కొనసాగేలా దృష్టిసారిస్తామన్నారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. మండల ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన తిరుమలకు కార్యాలయ సిబ్బంది, ఇతర నాయకులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36996/