schedule Thursday, September 10, 2026

మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..!

calendar_today July 20, 2025
person dharshininews
మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..!
మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..! - ఆదర్శనగర్‌లో ఘనంగా ఆషాడం బోనాలు - అమ్మవారికి వెండి కిరీటం బహుకరించిన విఠల్ నాయక్ - కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ అంటూ భక్తులు ఆదర్శనగర్‌ కట్ట మైసమ్మ తల్లిని వేడుకున్నారు. ఆదివారం దేవాలంయలో ఆషాడం మాసం సందర్భంగా అమ్మవార్ల బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జాతరలో భాగంగా ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, సతీమణి కిష్టమ్మ, కుటుంబంతో కలిసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి కిలోన్నరతో తయారు చేయించిన వెండి కిరీటం విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కాలనీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి.. బోనాలు సమర్పించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37012/