schedule Sunday, July 05, 2026

అందరి సహాకారంతోనే ఎస్సీ వర్గీకరణ

calendar_today July 21, 2025
person dharshininews
అందరి సహాకారంతోనే ఎస్సీ వర్గీకరణ
kvcs అందరి సహాకారంతోనే ఎస్సీ వర్గీకరణ - మాజీ ఎమ్మెల్యే నారాయణరావుకు, నేతలకు సన్మానం - సహకరించిన నేతలకు ఎమ్మార్పీఎస్ కృతజ్ఞతలు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యిందని ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో పాటు నావంద్గి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నర్సిరెడ్డి , బీఆర్ఎస్ నాయకుడు రంగారెడ్డిలను శాలువ పూలమాలతో సన్మానించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్టీలకు అతీతంగా అందరు సహకరించడతోనే సాధ్యమయ్యిందన్నారు. గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజిలప్ప, నర్సిములు, అంజిలప్ప, మధు, బాలప్ప తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37071/