చిలుక వాగు క్లీయర్..!
July 22, 2025
dharshininews
చిలుక వాగు క్లీయర్..!
- ఎమ్మెల్యే ఆదేశాలతో పనులు
- వాగు నుంచి వరద ప్రవాహానికి చర్యలు
- దగ్గరుండి పర్యవేక్షించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని చిలుక వాగు వరద నీటి ప్రవాహానికి ఆటంకాలను అధికారులు క్లియర్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఆర్అండ్ బి అధికారులు పనులు చేపట్టగా పార్టీ నాయకులు పనులను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే.
కుండపోత వర్షానికి హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి కోడంగల్ రోడ్డు మార్గం వైపు ప్రవహిస్తున్న చిలుక వాగుకు వరదనీరు పోటెత్తింది. దీంతో కోడంగల్ రోడ్డు మార్గంలోని చిలుక వాగు నూతన బ్రిడ్జి, కాస్త ముందున్న వాగు కాలువ వద్ద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఎదురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్, ఆర్అండ్ బీ అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్అండ్ బీ ఏఈ శ్రావణ్ సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రాలతో చిలుకవాగు, బ్రిడ్జి వద్ద పూడిక తీత పనులు చేయించారు.
ఈ పనులను తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ యువనాయకులు వికాష్ జోషీలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించిన విధంగా పనులు చేయించారు. దీంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద కూడా పనులు చేయించారు. బ్రిడ్జి మీద నుంచి వాహనాల రాకపోకలు సాగించే విధంగా దృష్టిసారించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుక వాగు సమస్య పరిష్కారం లభించడం పట్ల వికాష్ జోషి హర్షం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37085/