schedule Sunday, July 05, 2026

భట్టి కాన్వాయ్‌కి.. జలక్..!

calendar_today July 29, 2025
person dharshininews
భట్టి కాన్వాయ్‌కి.. జలక్..!
భట్టి కాన్వాయ్‌కి.. జలక్..! - డీప్యూటీ సీఎంను అడ్డుకునే యత్నం - కాగ్నా బ్రిడ్జిపై బీజేపీ నేతల ఆందోళన - చివరకు ఏం జరిగిందంటే...? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్‌కు బీజేపీ నేతలు జలక్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిని అడ్డుకునేందుకు యత్నించారు. తాండూరు - కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నానది బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ మార్గంలో తాండూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపన, రేషన్ కార్డుల పంపిణీ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్ తో వచ్చారు. అంతకుముందే విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మహిళ మోర్చ్ రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత, సీనీయర్ నాయకులు సాయిరెడ్డి, పటేల్ విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, సుదర్శన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు కాగ్నా నది బ్రిడ్జిపై డిప్యూటీ సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కారు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు, భద్రతా బలగాలను ఆందోళన చేసిన నేతలను పక్కకు తోశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యలతో డిప్యూటీ సీఎం కాన్వాయ్ ముందుకు వెళ్లింది. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ కాగ్నానదిపై భారీ రంద్రం ఏర్పడినా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ద్వజమెత్తారు. కాగ్నా బ్రిడ్జిపై రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకున్న నేతలను అదుపులోకి తీసుకుని యాలాల పోలీస్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దోమ కృష్ణ, సందీప్ కుమార్, అంతారం కిరణ్, మోహన్ రెడ్డి, హరికృష్ణ, జగన్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37336/