schedule Sunday, July 05, 2026

తాండూరులో వరలక్షీ శోభ..!

calendar_today August 8, 2025
person dharshininews
తాండూరులో వరలక్షీ శోభ..!
తాండూరులో వరలక్షీ శోభ..! - అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు - గాజుల మాలల దారణలతో దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో వరలక్ష్మీ వత్రం శోభ సంతరించుకుంది. kvcs శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వత్రం, ప్రత్యేక పూజలు చేయడం హిందూ సంప్రదాయం. ఇందులో భాగంగా తాండూరులోని అమ్మవార్ల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. పట్టణంలోని నెహ్రు గంజ్‌లో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజారి అంబ్రేష్‌ ఆధ్వర్యంలో గాజుల మాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అదేవిధంగా మర్రి చెట్టు కూడలి వద్ద వెలసిన రక్తమైసమ్మ, వాల్మీకీ నగర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆయా దేవాలయాల్లో మహిళ భక్తులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సల్లంగా సూడు తల్లీ అంటూ అమ్మవార్లను వేడుకున్నారు. మరోవైపు మహిళలు వారి ఇండ్లలో లక్ష్మీదేవీలకు పూజలు నిర్వహించారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/37492/