schedule Sunday, July 05, 2026

ఏకగ్రీవంగా హిందూ సమితి ఎన్నిక..!

calendar_today August 8, 2025
person dharshininews
ఏకగ్రీవంగా హిందూ సమితి ఎన్నిక..!
ఏకగ్రీవంగా హిందూ సమితి ఎన్నిక..! - అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్ , గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్ - ప్రధాన కార్యదర్శిగా ఐదోసారి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతి యేడాది వినాయక చవితికి ముందు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఆనవాయితిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. kvcs ఈ సమావేశంలో సమితి గౌరవాధ్యక్షులుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలుగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా ఐదో సారి మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కోశాధికారిగా రొంపల్లి సంతోష్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి అందరి సహాకారంతో కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సమితి పూర్తి కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు, హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37535/