schedule Sunday, July 05, 2026

శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు

calendar_today August 9, 2025
person dharshininews
శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు
శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు - అందరికి సౌభ్రాతృత్వం కలగాలి - ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ప్రార్థనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి, సామరస్యతకు ఉర్సు ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గాలొ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. kvcs శుక్రవారం రాత్రి సయ్యద్ సాబేర్ షాష కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గంధం సమర్పించారు. ప్రతి యేడాది మాదిరిగా వారి ఇంటి నుంచి సయ్యద్ కరీం సాహెబ్ దర్గాకు గంధం తీసుకవెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఉర్సు ఉత్సవాలలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దర్గా పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శాంతి, సామరస్యతకు ఉర్సు ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ముర్షద్ దర్గా ఉత్సవాలు కులమతాలకు అతీతంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. అల్లాహ్ దయతో అందరికి సౌభ్రాతృత్వం కలగాలి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ షేక్ కాసిం అలీ, నాయకులు బీదర్ రాజశేఖర్, బంటు వేణుగోపాల్, ఇంతియాజ్, దర్గా పెద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37542/