వినూత్నం.. వృక్షా బంధన్..!
August 9, 2025
dharshininews
వినూత్నం.. వృక్షా బంధన్..!
- చెట్టుకు రాఖీలు కట్టి పండగ
- పూజలు చేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ రోజు తాండూరులో వి నూత్నంగా వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శనివారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సేన వికారాబాద్ జిల్లా సభ్యురాలు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆధ్వర్యంలో వృక్షా బంధన్ ద్వారా చెట్టుకు రాఖీ కట్టారు. స్థానిక మహిళలతో కలిసి చెట్టుకు ఆమె రాఖీలు కట్టి.. కట్టించారు.
సహజ సిద్ధంగా తయారు చేసిన రాఖీలు, గోవు పేడ రాఖీలు, రాఖీ పుష్పాలు కట్టారు. అనంతరం చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా వృక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
కేవలం రక్తసంబంధీకులే కాకుండా ప్రకృతి నుంచి కూడా రక్షణ ఉండాలనే ఉద్దేశంతో వృక్షా బంధన్ ద్వారా అవగాహన కల్పించనట్లు తెలిపారు. మానవాళికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని రక్షించుకోవడం కూడా మన బాధ్యత అని పేర్కొన్నారు. వృక్షా బంధన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37552/