schedule Sunday, July 05, 2026

స్పందించిన అధికారులు..!

calendar_today August 12, 2025
person dharshininews
స్పందించిన అధికారులు..!
స్పందించిన అధికారులు..! - ఎట్టకేలకు పైపులైన్‌కు మరమ్మత్తులు - హర్షం వ్యక్తం చేసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. లీకేజి గురవుతున్న పైపులైన్‌కు ఎట్టకేలకు మరమ్మత్తులు చేయించారు. తాండూరు పట్టణం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ మురుగు కాలువలో ఉన్న మున్సిపల్ తాగునీటి పైపులైన్ లీకేజీకి గురైంది. kvcs రెండు రోజలుగా పైపులైన్ లీకేజీ కావడంతో పాటు తాగునీరు కలుషితం అవుతోంది. విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయంపై దర్శిని న్యూస్‌లో కథనం కూడా వచ్చింది. అదేవిధంగా ఇతర మీడియాలో వచ్చిన కథనాలు కూడా వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు మరమ్మత్తులు చేపట్టారు. గంట పాటు శ్రమించి మరమ్మత్తులను పూర్తి చేయించారు. తాగునీటి పైపులైన్‌కు మరమ్మత్తులు చేయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గం సెయింట్ మార్క్స్‌ స్కూల్ వద్ద రెండు నెలలుగా లీకేజీ అవుతున్న పైపులైన్ లీకేజీని మరమ్మత్తులు చేయలేదు. దీంతో పాటు పలు కాలనీల్లో కూడా లీకేజీల కోసం తవ్విన గుంతలు అధికారుల తీరును వెక్కిరిస్తూనే ఉన్నాయి. వాటిని కూడా మరమ్మత్తులు చేయించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37670/