schedule Wednesday, September 09, 2026

మత్తు వదిలితేనే.. మంచి భవిష్యత్తు..!

calendar_today August 13, 2025
person dharshininews
మత్తు వదిలితేనే.. మంచి భవిష్యత్తు..!
మత్తు వదిలితేనే.. మంచి భవిష్యత్తు..! - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - మార్కెట్ యార్డులో ప్రతిజ్ఞ, అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తు వదిలితేనే.. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిషా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా తాండూరు మార్కెట్ యార్డులో అధికారులు, డైరెక్టర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. kvcs ఈ సందర్భంగా చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు వ్యసనాలకు యువత బానిసలు కావడం విచారకరమన్నారు. యువతతో పాటు అందరు అందరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తును నియంత్రించడం.. అలవాట్లను తరిమేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్, సూపర్ వైజర్ హబీబ్ అల్వీ, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వ్యాపారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ కరీంకు నివాళులు మరోవైపు బుధవారం మార్కెట్ కమిటిలో జరిగిన సమావేశంలో డైరెక్టర్ మహమ్మర్ కరీంకు చైర్మన్, డైరెక్టర్లు నివాళులు అర్పించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కొనసాగిన మహమ్మద్ కరీం ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఆయన మరణం తరువాత తొలిసారి జరిగిన సమావేశంలో చైర్మన్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కరీం ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37692/