schedule Sunday, July 05, 2026

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

calendar_today August 13, 2025
person dharshininews
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - అమృత్, చిలుక వాగు డ్రైన్ నిర్మాణాలు ఫోకస్ - పరిశీలించిన పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణాన్ని ఆయన సందర్శించారు. kvcs మున్సిపల్ ఏఈ ఖాజాతో కలిసి చిలుక వాగు డ్రైన్ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని అమృత్ 2.0 కింద నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనుల వివరాలను ఆరా తీశారు. తాండూరు పట్టణంలో తాగునీరు అందించేందుకు సుమారు రూ. 27 కోట్లతో అమృత్ 2.0 కింద పాత మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ నగర్, రాజీవ్ కాలనీలో తాగునీటి ట్యాంకు నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా రూ. 16 కోట్లతో చిలుక వాగు డ్రైన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ పరిశీలించారు. ట్యాంకుల నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్యాంకుల నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి అందేలా చూస్తామన్నారు. ఇసుక కేటాయింపులు చేసుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా చిలుక వాగు డ్రైన్ పనులు ఆలస్యం కాకుండా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఉదయ్ కుమార్. మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37705/