schedule Sunday, July 05, 2026

సర్కారుతో తేల్చుకోవడమే..!

calendar_today August 16, 2025
person dharshininews
సర్కారుతో తేల్చుకోవడమే..!
సర్కారుతో తేల్చుకోవడమే..! - పేదల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం - పెంచిన ఫించన్లు వెంటనే అమలు చేయాలి - వచ్చే నెల 3న మహాగర్జనకు తరలిరండి - ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన ఫించన్లను అమలు చేసుకునేందుకు సర్కారుతో తేల్చుకుందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. kvcs శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం గగ్రాణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫించన్ ల సన్నాహక సభకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకం అమలుతో పాటు రేషన్ కోటా, వికలాంగులకు, వృద్ధులకు ఫించన్ అమలు పథకానికి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసిందన్నారు. దాని ఫలితంగా ఆరోగ్య శ్రీ సేవలు, ఫించన్లు, రేషన్ పొందుతున్నారని అన్నారు. ఎన్నికల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఫించన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు అయినా అమలు చేయడం లేదన్నారు. ఫించన్లు పెంచకుండా, కొత్తవి ఇవ్వకుండా సీఎం రేవంత్ సర్కారు మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదన్నారు. ఫించన్ల విషయంలో సీఎంతో తాడో పేడే తె ల్చుకుందామన్నారు. ఇందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించే మహా గర్జన సదస్సుకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా ఉప అధ్యక్షులు జింగుర్తి నర్సింలు మాదిగ, బి.కృష్ణ మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షుడు మెట్లి సూర్య ప్రకాష్ మాదిగ, యాలాల్ మండల అధ్యక్షుడు సూర్య ప్రకాష్ మాదిగ, పెద్దెములు మండల అధ్యక్షుడు ఉమ శంకర్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు చెందు, సుందర్, రాజు భాయ్, గజ్జలప్ప, బలరామ్ మాదిగ, రవి కుమార్, అనిల్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ, పరుశురాం మాదిగ, స్వామిదాస్ మాదిగ, జగదీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37787/