సంస్కృతికి గౌరవం తెచ్చిన గౌడి కుటుంబం..!
August 17, 2025
dharshininews
అమ్మా, నాన్నలకు అపురూప గౌరవం..!
- వైభవంగా పాదపూజ, తులాభారం
- సంస్కృతికి గౌరవం తెచ్చిన గౌడి కుటుంబం
- ముగ్ద మనోహరులైన నేతలు, బంధు మిత్రులు
- శభాశీస్సులు తెలిపిన రాజకీయ నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తల్లిదండ్రులను మించిన దైవం లేదని చెబుతున్న ధర్మాన్ని అనుసరించి తాండూరుకు చెందిన గౌడి కుటుంబం వారి అమ్మా, నాన్నలకు అపురూప గౌరవాన్ని అందించారు. జన్మనిచ్చిన అమ్మ, నాన్నలకు పాదపూజ, తులాభారం నిర్వహించి మన సంస్కృతిని చాటుకున్నారు.
కార్యక్రమానికి హాజరైన పెద్దలు, రాజకీయ ప్రముఖులు వారి ఔనత్యానికి శుభాశీస్సులు అందించారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన గౌడి కుటుంబానికి మంచి పేరు ఉంది. గౌడి ఎల్లయ్య, గౌడి సత్యమ్మ కుటుంబం 60 మంది సభ్యులతో ఆదర్శంగా జీవిస్తున్నారు. వీరికి గౌడి శ్రీనివాస్- సునీల, గౌడి వెంకటేశం, మంజుల(మాజీ జెడ్పీటీసీ), గౌడి సత్యనారాయణ - జగదీశ్వరి, గౌడి విష్ణుమూర్తి- సుజితలు కుమారులు, కోడళ్లు, వీరితో పాటు ముగ్గురు కూతుళ్లు నాగలక్ష్మీ, వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మీలు ఉన్నారు. అయితే సో ఆదివారం గౌడి ఎల్లయ్య కుమారులు తాండూరు పట్టణం, మండల కార్యాలయం ఎదురుగా కోకట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన నూతన గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించారు.
అనంతరం ఇందూరు మహంతయ్య స్వామి ఆధ్వర్యంలో గౌడి ఎల్లయ్య, సత్యమ్మలను కుమారులు గౌడి శ్రీనివాస్, గౌడి వెంకటేశం, గౌడి సత్యనారాయణ, గౌడి విష్ణుమూర్తిలు కుటుంబ సమేతంగా తల్లిదండ్రులకు వైభవంగా పాదపూజ. శతాభి షేక, సహస్ర చంద్రదర్శన పూజ, శాంతి, ఆయుష్య పూజతో పాటు తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని చాటి చెబుతున్న ధర్మశాస్త్రం మేరకు వారు తల్లిదండ్రులకు పూజలు, తులాభారం నిర్వహించడంతో సంస్కృతిపై గౌరవాన్ని పెంచింది.
ఈ వేడుకలకు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, నాయకులు డా. సంపత్ కుమార్, జిల్లా గంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీసీ కమీషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. సిద్రాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ మహిళ కన్వీనర్ శకుంతల, మాజీ వైస్ ఎంపీపీలు రాజప్పగౌడ్, స్వరూప, వెంకట్రామ్ రెడ్డి, మొగులప్ప, తుప్పుడు శేఖర్, శ్రీనివాస్ చారి, కొత్త నర్సయ్య గౌడ్, బాలేష్ గౌడ్, హేమంత్ కుమార్, మాజీ సర్పంచులు కుర్వ నాగార్జున. సాయిలు. ఇస్మాయిల్, మల్లప్ప, జగదీష్, విజయ్ కుమార్, కురువ వెంకటయ్య, నర్సిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరై శుభాశీస్సులు తెలిపారు.
సన్మానించిన కురువ సంఘం నాయకులు
మరోవైపు ఈ వేడుకులకు తాండూరు కురువ సంఘం నాయకులు హాజరయ్యారు. గౌడి ఎల్లయ్య. సత్యమ్మ దంపతులను వారి కుమారులు శ్రీనివాస్, వెంకటేశం. సత్యనారాయ. విష్ణుమూర్తిల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కురువ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37856/