schedule Wednesday, September 09, 2026

రాములోరికి విరాళాల వెల్లువ..!

calendar_today August 17, 2025
person dharshininews
రాములోరికి విరాళాల వెల్లువ..!
రాములోరికి విరాళాల వెల్లువ..! - దేవాలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక చేయూత - తమవంతు సాయం అందిస్తున్న దాతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిరం పునర్ నిర్మాణంకు విరాళాలు అందుతున్నాయి. ఆదివారం పలువురు వ్యాపారస్తులు, దాతలు దేవాలయ పునర్ నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించారు. kvcs ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మురళి తన వంతుగా రూ.20వేలు అందజేశారు. అదేవిధంగా వ్యాపారులు గుముడాల పద్మయ్య(త్రిపుల్ ఎక్స్) రూ. 25 వేలు, ఆగీరు మహేష్, దావులయ్య, దిల్ హోటల్ బ్రదర్స్ రూ. 5వేల చొప్పున వేరు వేరుగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు విరాళాలు అందజేసిన ఉద్యోగికి, వ్యాపారస్తులకు అభినందనలు తెలిపారు. తాండూరులోని ప్రసిద్ధి గాంచిన శ్రీ రామ మందిర నిర్మాణానికి ఆర్థిక చేయూత ఎంతో అవసరమని అన్నారు. దాతలు, వ్యాపారులు, భక్తులు తమ వంతు చేయూత అందించి దేవాలయ పునర్ నిర్మాణానికి తోడ్పడాలని కోరుతున్నారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో అందరికి మంచి జరుగుతుందని అకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37859/