schedule Wednesday, September 09, 2026

మట్టి వినాయకులను పూజిద్దాం..!

calendar_today August 19, 2025
person dharshininews
మట్టి వినాయకులను పూజిద్దాం..!
మట్టి వినాయకులను పూజిద్దాం..! - మండపాల వద్ద జాగ్రత్తలు అందరి బాధ్యత - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ హితం కోసం అందరం మట్టి వినాయకులను పూజిద్దామని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ కోరారు. kvcs వారం రోజుల్లో వినాయక చవితి వస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. పండగకు సిద్దమైన నిర్వహకులు, భక్తులు మట్టి వినాయకుల ప్రతిష్టాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రసాయన రంగులతో తయారు చేసిన వినాయకుల వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. మట్టి వినాయకులను పూజించడం సంప్రదాయానికి గౌరవం తీసుకరావడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల వద్ద నిర్వహాకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. పోలీసు శాఖతో పాటు పలు శాఖల నుంచి అనుమతులు పొంది మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు డీజేలు వాడకుండా భక్తి భావంతో వినాయకున్ని కొలుచుకోవాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37892/