schedule Sunday, July 05, 2026

పారదర్శకంగా సేవలందించండి..!

calendar_today August 21, 2025
person dharshininews
పారదర్శకంగా సేవలందించండి..!
పారదర్శకంగా సేవలందించండి..! - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కొత్త కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధిలో, పరిపాలనలో పారదర్శకంగా సేవలను అందించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కొత్త కమీషనర్ యాదగిరిని ఆదేశించారు. kvcs తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యాదగిరిని నియమించారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కొత్త కమీషనర్ యాదగిరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను సన్మానించి.. మొక్కను బహుకరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కమీషనర్ యాదగిరికి అభినందనలు తెలిపారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి దృష్టిసారించాలన్నారు. పార్టీలకతీతంగా పాదర్శకంగా సేవలను అందించాలని ఆదేశించారు. అనంతరం కమీషనర్ యాదగిరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37990/