schedule Sunday, July 05, 2026

శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం

calendar_today August 22, 2025
person dharshininews
శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం
శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం - పొంగు శనైశ్చర దేవాలయంలో ఏర్పాట్లు - పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : శని దోషంను వదిలించేందుకు రేపు శనివారం మంచి రోజు ఉందని పండితులు చెబుతున్నారు. రేపు శనివారం అమావాస్య సందర్భంగా యాలాల మండలం కోకట్ శివారు సంగెంకుర్దు గ్రామంలోని శ్రీ పొంగు శనైశ్చర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్ తెలిపారు. kvcs ఇందుకోసం దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతక రిత్యా అష్టమ శని, శని దోష నివారణకు శని శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శనివారం రోజు వచ్చిన అమావాస్య సందర్భంగా శని దోష పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కావున భక్తులు దేవాలయాన్ని సందర్శించి.. శని పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని.. శని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38026/