schedule Sunday, July 05, 2026

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మనోహరన్న

calendar_today August 23, 2025
person dharshininews
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మనోహరన్న
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మనోహరన్న - ఏటీసీ(ఐటీఐ) ఏర్పాటుకు కృషి అభినందనీయం - అందులో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి బాట - అడ్మిషన్లు పొంది సద్వనియోగం చేసుకోవాలి - ఎన్ఎన్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారని ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ అన్నారు. kvcs శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ గత ప్రభుత్వం తాండూరుకు మంజూరు చేసిన ఐటీఐ కాలేజీని ఏటీసీ గా ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఏటీసీ సెంటర్ ను అందుబాటులోకి తీసుకరావడమే కాకుండా మౌళిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏటీసీలో వివిధ కోర్సులను ప్రవేశ పెట్టి.. అందులో విద్యార్థులు, అభ్యర్థులు చేరే విధంగా చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఏటీసీలో చేరిన అభ్యర్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఎమ్మెల్యే తీసుకుంటానని పేర్కొనడం సంతోషరకరమన్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. తాండూరు ఏటీసీ సెంటర్ లో పదో తరగతి విద్యార్థులు, ఇంటర్ చదివిన విద్యార్థులు చేరి ఉద్యోగ, ఉపాది అవకాశాలు పొందవచ్చన్నారు. ఈనెల 28వ తేదిలోపు ఏటీసీలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38051/