schedule Sunday, July 05, 2026

జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..!

calendar_today August 23, 2025
person dharshininews
జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..!
జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..! - శ్రావణ మాసం ముగింపు శోభ - అలంరించిన భజన కీర్తనలు - ఎఫ్‌ఎస్‌ గిరి, సుశీల అన్నదానం సేవ యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి సీతారాముల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమావాస్య, శ్రావణమాసం ముగింపు సందర్భంగా భక్తజనులు భారీగా తరలివచ్చారు. kvcs దేవాలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో సీతారాములకు ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలతో భక్తిభావం వెల్లివిరిసింది. సీతారాముల దర్శనం కోసం యాలాల మండంలోని భక్తులతో పాటు మహారాష్ట్ర, పూణే, కర్ణాటక, సోలాపూర్, కొడంగల్, మహబూబ్ నగర్, వికారాబాద్‌ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దేవాలయంలో సీతారాములను స్మరిస్తూ భక్తుల భజన కీర్తనలు అలంరించాయి. దేవాలయంలో శ్రావమాసం ఉత్సవాల ముగింపు సందర్బంగా మహారాష్ట్ర (పూణేకు) చెందిన ఎఫ్ఎస్ గిరి, సుశీల కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు సమక్షంలో దేవాలయ ప్రధాన అర్చకులు వదిరాజ్‌ జోషి ఎఫ్ఎస్ గిరి కుటుంభీకులను వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందించారు,. ఈకార్యక్రమంలో దేవాదాయ శాఖ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఫ్యామిలీ ఫౌండర్ సభ్యులు, జుంటుపల్లి మాజీ సర్పంచ్ రాఘవేందర్ రావు, పార్థసారథి రావు( అడ్వకేట్), హన్మంత్, ఎఫ్ఎస్ గిరి కుమారులు నరేంద్ర గిరి, సురేంద్ర గిరి, కోడలు దియా, అక్కంపల్లి భజన మండలి సభ్యులు తదితర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38065/