schedule Sunday, July 05, 2026

వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు

calendar_today August 24, 2025
person dharshininews
వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు
వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు - పోట్లీ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు - దర్శించుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - శోభాయమానంగా పల్లకి సేవ, భజన కీర్తనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వినాయక చౌరస్తా సమీపంలో ఉన్న పోట్లీ మహారాజ్ దేవాలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. kvcs శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆదివారం దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. దేవాలయంలో వెలసిన పోట్లీ మహారాజ్ కు అలంకరణ, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ తాడేం నరేందర్ ల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. భజన సమాప్తిని పురస్కరించుకుని దేవాలయంలో స్వామి పల్లకి సేవ ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. భక్తుల భజన కీర్తనలు రంజింపజేశాయి. అదేవిధంగా భజన సమాప్తి ఉత్సవాలలో భాగంగా తాండూరు కాంగ్రెస్ నాయకులు, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి స్వామిని వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. భజన సమాప్తి ఉత్సవాలలో పోటీ మహారాజ్ దేవాలయంలో ఆధ్యాత్మిక శోభసంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధి శ్రీనివాస్, ఆలయ కమిటి సభ్యులు నవీన్ గౌడ్, నీరటి రామలింగం, శ్రీనివాస్, జగన్, రాజ్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38092/