schedule Wednesday, September 09, 2026

ఆర్టీసీ ఆధాయ పెంపే లక్ష్యం..!

calendar_today August 25, 2025
person dharshininews
ఆర్టీసీ ఆధాయ పెంపే లక్ష్యం..!
ఆర్టీసీ ఆధాయ పెంపే లక్ష్యం..! - ప్రయాణికుల అవరాలు తీర్చేందుకు ప్రాధాన్యం - తాండూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ ఖుష్రు షా ఖాన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ఆధాయం పెంపే లక్ష్యంగా అందరు పనిచేయాలని ఆ సంస్థ ఈడీ(ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్) ఖుష్రుషా ఖాన్ అన్నారు. సోమవారం తాండూరులోని ఆర్టీసీ డీపోను ఆయన సందర్శించారు. kvcs తాండూరు డిపోలో డీపో మేనేజర్ సురేష్‌ కుమార్‌తో కలిసి కలియ తిరిగి పరిశీలించారు. డిపోలో ఏఏ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉందని, ఎక్కువగా రెవెన్యూ వచ్చే ప్రాంతాలను అడిగి తెలుసుకున్నారు. తీర్థయాత్రలు, ఇతర కార్యక్రమాలకు ప్రయాణికుల కోరికలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపించాలని వివరించారు. ప్రయాణికుల కు ఇబ్బందులు కలవకుండా సమయానికి బస్సులు నడిపించాలన్నారు. ఆదాయ మార్గం పెంచేందుకు కృషి చేయాలన్నారు. డిపోలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38135/