schedule Sunday, July 05, 2026

రేపే వినాయకుల లడ్డూ వేలం..!

calendar_today August 29, 2025
person dharshininews
రేపే వినాయకుల లడ్డూ వేలం..!
రేపే వినాయకుల లడ్డూ వేలం..! - అందరు పాటించాలని సమితి విజ్ఞప్తి - కొత్త సంప్రదాయం అమలుపై ఆసక్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టనంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు మండపాల్లో కొలువుదీరిన గణనాధులు పూజలందుకుంటున్నారు. kvcs వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై అప్పుడే మూడు రోజులు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో నిమజ్జనం ఉత్సవాలు జరగబోతున్నాయి. నిమజ్జనం ఉత్సవాలు అనగానే అందరికి లడ్డూ వేలం గుర్తుస్తోంది. ప్రతి యేడాది నిమజ్జనం రోజు లడ్డూ వేలం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ సారి ఆ ఆనవాయితికి తాండూరు హిందూ ఉత్సవ సమితి బ్రేక్ వేయాలని నిర్ణయించింది. లడ్డూల వేలం ఐదు రోజులకు కాకుండా నిమజ్జనంకు ఒకరోజు ముందే నిర్వహించాలని కోరింది. అప్పటికే మూడు రోజులు పూర్తి కావడంతో నాలుగు రోజు లడ్డూల వేలం నిర్వహించాలని హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరోసారి విజ్ఙప్తి చేశారు. శుక్రవారం యాలాల మండలం కోకట్ కాగ్నావాగులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. హిందూ ఉత్సవ సమితి ప్రకటించిన విధంగా మండలపాల నిర్వహులు, ఉత్సవ సమితి సభ్యులు నాలుగో రోజు శనివారమే లడ్డూల వేలం నిర్వహించుకోవాలని కోరారు. వేలంలో లడ్డూ దక్కించుకున్న భక్తులకు మరుసటి అందజేసి.. ఊరేగింపు లాంచనాలతో తరలించాలని కోరారు. అదేవిధంగా నిమజ్జన ఉత్సవాలకు సహకరిస్తున్న కోకట్ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈసారి కొత్తగా ఒకే రోజు ముందే లడ్డూ వేలం సంప్రదాయంపై ఆసక్తి ఏర్పడింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38225/