schedule Sunday, July 05, 2026

హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు

calendar_today August 31, 2025
person dharshininews
హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు
హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు - ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చేరిక జరిగింది. kvcs తాండూరు పట్టణంకు చెందిన రిటైర్డ్ ఏసీటీఓ, టీఆర్సీ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, సీనీయర్ సిటిజన్ సభ్యులు ఉదయ్ శంకర్ పటేల్, పాత తాండూరు కోటేశ్వర దేవాలయ కమిటి కార్యదర్శి పల్లే పరమేశ్వర్ లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణు సమక్షంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38263/