schedule Saturday, July 11, 2026

నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర్చుకోవాలి

calendar_today November 20, 2021
person dharshininews
నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర్చుకోవాలి
నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర్చుకోవాలి - మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: విద్యార్థి ద‌శ నుంచే ప్ర‌తి ఒక్క‌రు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పేర్కొన్నారు. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌వేటు పాఠ‌శాల‌లో విద్యార్థుల ప‌ద‌వి ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ప్రతినిధులుగా ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతినిధులుగా ఎన్నికైన విద్యార్థులు సేవలను ప్రతి విద్యార్థికి విద్యాపరంగా, క్రీడాల పరంగా, నాయకత్వ పరంగా ఎలాంటి విద్వేషాలు లేకుండా అందించాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రమశిక్షణ కలిగి, నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.