schedule Saturday, July 04, 2026

మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!

calendar_today September 5, 2025
person dharshininews
మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!
మీ ఇంటి ఫోటో మీరే తీయండి..! - ఇందిరమ్మ యాప్‌లో కొత్త ఆప్షన్ - బిల్లుల మంజూరు చేతి వాటానికి చెక్‌ - ప్రయోగాత్మకంగా అమలుకు చర్యలు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా జరుతున్నాయి. ఇళ్ల నిర్మాణం చేస్తున్న లబ్దిదారులకు వివిధ దశలలో బిల్లులు కూడా మంజూరు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నిర్మాణ దశలను బట్టి.. బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే బిల్లుల మంజూరులో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని అభియోగాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వసూళ్లకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులే సొంతంగా ఇంటి నిర్మాణ దశలను ఫోటో తీసి.. అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పించనుంది. ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. kvcs మీ ఇంటి ఫోటో మీరే తీయోచ్చు.. మొదట ఇందిరమ్మ ఇళ్లు అనే మొబైల్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అందులో బెనిఫిషియరీ లాగిన్‌కు వెళ్లాలి. అక్కడ డాష్‌ బోర్డులోకి వెళ్లి లబ్ధిదారుడి పేరు, మొబైల్‌ నంబరు, గ్రామం నమోదు చేయాలి. అనంతరం ఫొటో క్యాప్చర్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో అడుగుతుంది. ఆ వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆ దశకు సంబంధించిన ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణ వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్‌ వివరాలను చూపుతుంది. వీటికి సంబంధించిన చిత్రాలు యాప్‌లో ఉంటాయి. యాప్‌లో అడిగే ప్రశ్నలకు అవును/కాదు అని సమాధానం చెప్పాలి. తర్వాత ఇంటి నిర్మాణ దశ అప్‌లోడ్‌ అవుతుంది. ఎవరైనా లబ్ధిదారుడు తప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే స్థానిక అధికారుల, సిబ్బంది విచారణలో బయటపడుతుంది. త్వరలోనే లబ్ధిదారులకు ఈ యాప్‌నకు సంబంధించి అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38405/