schedule Wednesday, September 09, 2026

కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..!

calendar_today September 9, 2025
person dharshininews
కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..!
కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..! - యూరియా పంపిణీలో సర్కార్ విఫలం - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతులు రోడ్లు ఎక్కే దుర్గతి పట్టిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ద్వజమెత్తారు. kvcs తాండూరు నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేపట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రైతులకు సకాలయంలో యూరియా అందించడంలో రేవంత్ సర్కార్ ఫేయిల్ అయిందని మండిపడ్డారు. వర్షాల వల్ల పాడైపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు యూరియా కోసం బారులు తీరే పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవచ్చిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో పదేళ్ల పాలనలో రైతుల ఎనాడు యూరియా ఇబ్బందులు రాలేదని గుర్తుచేశారు. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులను మళ్లీ తీసుకవచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమరి ్శంచారు. 50 సార్లు ఢీల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 50 బస్తాల యూరియాను కూడా తీసుకరాలేదని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా కోసం రోడ్డున పడితే బీజేపీ నేతలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే రైతులకు అవసరమయ్యే యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడి.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38481/