schedule Wednesday, September 09, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

calendar_today September 10, 2025
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి - మున్సిపల్ కమీషనర్ యాదగిరి - ఎమ్మెల్యే సహాకారంతో వార్డు అభివృద్ధి - మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. kvcs బుధవారం తాండూరు పట్టణంలోని 25వ వార్డు సౌరమ్మ దేవాలయం వద్ద డ్రైన్ నిర్మాణ పనులను కమీషనర్ యాదగిరి, వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వార్డులో డ్రైన్ పనులతో పాటు దాదాపు రూ.43 లక్షలతో ప్రగతి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. నెలరోజుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల తదితర పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38497/